అతి తిండి వ్యాధి - Binge Eating Disorder in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 28, 2018

March 06, 2020

అతి తిండి వ్యాధి
అతి తిండి వ్యాధి

అతి తిండి వ్యాధి అంటే ఏమిటి?

అతి తిండి వ్యాధి తరచుగా గుర్తించబడని, అనియంత్రంగా తిండి తినే ఒక ఆందోళనకర పరిస్థితి కానీ తరువాత మానసిక అపరాధాన్ని కలిగిస్తుంది.

ఇది యువకులలో అత్యంత సాధారణమైన రుగ్మతలలో ఒకటి.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఈ పరిస్థితితో బాధపడుతున్న వ్యక్తి స్వల్ప వ్యవధిలోనే సాధారణ మొత్తాల కంటే అధికంగా ఆహారాన్ని తీసుకుంటాడు. దాని తర్వాత, వారు ఒత్తిడికి, అపరాధభావానికి లేదా వారిపై వారే కోపానికి గురిఅవుతారు.

ఇతర లక్షణాలు:

  • అసౌకర్యంగా అనిపించే వరకు తినడం
  • చాలా వేగంగా తినడం
  • అవమానం కారణంగా ఇతరులతో కలిసి భోజనం చెయ్యడాన్ని నివారించడం, మరియు వారి ఆహార విధానం గురించి రహస్యంగా ఉంచడం.
  • ఒత్తిడి, ఆందోళన లేదా కోపం వలన కూడా అతిగా తినడం తర్వాత అపరాధభావానికి గురికావడం

పురుషుల కంటే స్త్రీలలో ఈ పరిస్థితి సర్వసాధారణం మరియు ఇరవైల వయస్సు నుండి ముప్పైల వయస్సులో ఉన్న ప్రజలను ఇది ప్రభావితం చేస్తుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

అమితంగా తినటం అనేది ప్రవర్తనా మరియు మానసిక కారణాల ఆధారంగా ఉంటుంది, ఐనప్పటికీ ఖచ్చితమైన కారణాలు తెలియలేదు, కానీ ప్రమాద కారకాలు గుర్తించబడ్డాయి.

  • అతిగా తిండి తినే వారిలో సుమారు 30% మంది ఊబకాయం కలిగి ఉండడం వల్ల ఊబకాయం అతిగా తినేలా చేస్తుందని విశ్వసిస్తారు. బరువు సమస్యలు అనేవి ఈ పరిస్థితికి ఒక కారణం అలాగే సమస్య కూడా కావచ్చు కాబట్టి ఇది ఒక ఆవృత్త పరిస్థితి.
  • జన్యుపరమైనవి: మెదడులో అధికంగా డోపామైన్ స్థాయిలను కలిగి ఉన్న ప్రజలలో ఆహారాన్నిఅధికంగా తినాలనే కోరిక ఉంటుంది, మరియు అది సంతోష భావాలను పెంచుతుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం మరియు స్వీయ-గౌరవ సమస్యలు వంటి మానసిక పరిస్థితులు అతిగా తినేలా చేసే బలమైన కారకాలు, ఇవి ఆహారం ఒక మంచి అనుభూతి అనిపించేలా చేస్తాయి.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

అతి తిండి వ్యాధి (BED) యొక్క నిర్ధారణ ప్రధానంగా వ్యక్తి యొక్క అంగీకారం మీద ఆధారపడి ఉంటుంది.

  • అసౌకర్య పరిస్థితులకు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మరియు వారి ప్రతిస్పందనల ఆధారంగా, ఒక నిపుణుడు ఈ రుగ్మతను గుర్తించవచ్చు.
  • ఒక వ్యక్తి యొక్క ఆహార విధానాలు, ఆహార అలవాట్లు మరియు శరీర బరువు కూడా ఈ పరిస్థితిని గుర్తించడానికి సహాయపడుతుంది.

అతి తిండి వ్యాధి యొక్క చికిత్స మానసిక చికిత్స, కౌన్సెలింగ్, బరువు తగ్గుదల వ్యాయామాలు మరియు మందులు కలయికతో ఉంటుంది.

  • కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (cognitive behavioural therapy) ద్వారా, నిపుణుడు ఒక వ్యక్తిని అతిగా తినేలా చేసే ప్రేరకాలను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు. దీని అర్థం ఏమిటంటే రోగిలో ఒత్తిడి, ఆందోళన లేదా కోపం యొక్క భావాలను గుర్తించడం.
  • అతిగా తినడం అనేది ఒక సమస్య వలన అయితే, కౌన్సిలింగ్ సెషన్లు ఆ సమస్యను అధిగమించడానికి సహాయపడతాయి.
  • బరువు తగ్గుదల చికిత్సల ద్వారా, ఒక వ్యక్తి యొక్క స్వీయ-గౌరవం మరియు శరీర రూప సమస్యలను మెరుగుపరచవచ్చు.
  • ఈ చికిత్సలతో కలిపి, వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి యాంటీ డిప్రెసేంట్లు (Anti-depressants) ఇవ్వవచ్చు. ఆహార మార్పులకు సంబంధించిన నిర్మాణాత్మక పద్ధతి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.



వనరులు

  1. Guerdjikova AI, Mori N, Casuto LS, McElroy SL. Binge Eating Disorder. Psychiatr Clin North Am. 2017 Jun;40(2):255-266. PMID: 28477651
  2. National Institute of Mental Health [Internet] Bethesda, MD; Eating Disorders. National Institutes of Health; Bethesda, Maryland, United States
  3. National Institute of Diabetes and Digestive and Kidney Diseases. Binge Eating Disorder. U.S. Department of Health and Human Services. [internet].
  4. Brownley KA, Berkman ND, Peat CM, Lohr KN, Cullen KE, Bann CM1, Bulik CM. Binge-Eating Disorder in Adults: A Systematic Review and Meta-analysis. Ann Intern Med. 2016 Sep 20;165(6):409-20. PMID: 27367316
  5. Kimberly A. Brownley, Nancy D. Berkman, Jan A. Sedway, Kathleen N. Lohr, Cynthia M. Bulik. Binge eating disorder treatment: A systematic review of randomized controlled trials. 16 March 2007, Volume40, Issue4