అసాధారణ గర్భాశయ రక్తస్రావం - Abnormal Uterine Bleeding in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 27, 2018

July 31, 2020

అసాధారణ గర్భాశయ రక్తస్రావం
అసాధారణ గర్భాశయ రక్తస్రావం

అసాధారణ గర్భాశయ రక్తస్రావం అంటే ఏమిటి?

సాధారణ ఋతుక్రమ సమయంలో కాకుండా మాములు రోజుల్ల రక్త స్రావం కనిపించడం , తరచుగా ఋతుచక్రాలురావడం, ఋతు చక్ర సమయంలో అధిక రక్తస్రావం మరియు దీర్ఘకాలిక రక్తస్రావం వంటివిఅసాధారణ గర్భాశయ రక్తస్రావాన్ని సూచిస్తాయి.

చాలా మంది మహిళలల్లో ఖచ్చితమైన తేదీకి అనుగుణంగా ఋతుచక్రాలు రానందున, 21 నుండి 35 రోజుల మధ్య సమయంలో 2 ఋతుచక్రాల పరిమితి అనుమతించబడుతుంది. ఇది పరిమితి దాటిపోయినా లేదా త్వరగా ఋతుచక్రం సంభవించినా, ఆరక్తస్రావ కారణాలనుపరీక్షించాల్సిన అవసరం ఉంది.

ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఋతుచక్రాలలో సాధారణంగావైవిధ్యాలు చూపే మహిళల్లో ఇది ఆమోదయోగ్యమైన వైద్యులు భావించినప్పటికి, అసాధారణమైన గర్భాశయ రక్తస్రావానికికొన్ని నిర్దిష్ట సంకేతాలు ఉన్నాయి:

  • 3 వారాలలో ఒక్కసారి కంటే ఎక్కువగా లేదా 5 వారాల కంటే ఎక్కువ సమయం పడుతున్నపుడు.
  • ఒక వారం పాటు లేదా 2 రోజులలోపు ఉన్న ఋతుక్రమ రక్తస్రావం.
  • గంటకు ఒకసారి కంటే ఎక్కువగా మెత్తలను / ప్యాడ్స్ (tampons) మార్చుతున్నపుడు.
  • సంభోగం తర్వాత లేదా ఋతుచక్రాల మధ్యలోరక్తస్రావం లేదా రక్త చుక్కలు

దాని ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ పరిస్థితికి అత్యంత సాధారణ కారణం హార్మోన్లలో అసమతుల్యత. లేదా ఇతర పరిస్థితులు ఈ క్రింది విధంగా ఉండవచ్చు:

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు శారీరక పరీక్షను నిర్వహిస్టార్ కాబట్టి తక్షణ రోగ నిర్ధారణ సాధ్యపడకపోవచ్చు,తరువాతిఋతుచక్రాన్ని మరియు మధ్యలో సమయాన్ని పరిశీలించిన తర్వాతనిర్ణయించవచ్చు. గర్భ పరీక్ష మరియు మునపటి ఆరోగ్య చరిత్ర అనేవిప్రాధమిక రోగ నిర్ధారణ దశలు. దీని తరువాత హార్మోన్ల అసమతుల్యత, ఇనుము లోపం లేదా రక్త సంబంధిత రుగ్మతల కొరకు రక్త పరీక్షలు చేస్తారు. వైద్యులు గర్భాశయాన్ని పరిశీలించడానికి అల్ట్రాసౌండ్ను లేదా గర్భాశయ ద్వారాన్ని పరిశీలించడానికి ఒక హిస్టెరోస్కోపీ (hysteroscopy)ను కూడా నిర్వహిస్తారు. క్యాన్సర్ లేదా ఇతర రుగ్మతలఅనుమానం ఉన్నట్లయితే ఒక జీవాణుపరీక్ష(బయాప్సీ)కూడా నిర్వహించబడుతుంది.

రోగనిర్ధారణ సూచించిన దానిపై ఆధారపడి, సమస్య పరిష్కారాన్నీ మరియు శీఘ్ర ఉపశమనాన్ని అందించడానికి చికిత్స యొక్క ఒక పద్ధతి ఎంపిక చేయబడుతుంది. చికిత్స యొక్క కొన్ని పద్ధతులు:

  • ఋతుచక్రాలని క్రమబద్ధీకరించడానికి మరియు రక్త స్రావాన్ని తగ్గించడానికి హార్మోన్ల ఔషధప్రయోగం. అవిజనన నియంత్రణ మందులు గోనాడోట్రోపిన్-విడుదల హార్మోన్ అగోనిస్ట్ల (Gonadotropin-releasing hormone agonists) వంటివి.
  • రక్తస్రావాన్ని తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు
  • రక్తం గడ్డకట్టడం మరియు రక్తస్రావం తగ్గించడం కోసం ట్రాన్సెక్స్మిక్ యాసిడ్ (Tranexamic acid).
  • గర్భాశయం లోపలి పొర (endometrium) ను తొలగించడంఇది గర్భాశయం యొక్క గోడలనునాశనం చేస్తుంది, కానీ ఆ తరువాత ఋతుచక్రాన్ని ఆపుతుంది
  • మైమోమెక్టమీ (Myomectomy) - ఫైబ్రోయిడ్లను తొలగించడం లేదా వాటికి రక్త సరఫరాను ఆపడం
  • హిస్టిరెక్టమీ (Hysterectomy)పెద్ద ఫైబ్రాయిడ్లు లేదా గర్భాశయ క్యాన్సర్



వనరులు

  1. American College of Obstetricians and Gynecologists. Management of Acute Abnormal Uterine Bleeding in Nonpregnant Reproductive-Aged Women. Washington, DC; USA
  2. American Society for Reproductive Medicine. Abnormal Uterine Bleeding. The American Fertility Society; U.S. state of Alabama
  3. Ministry of Health and Family Welfare. Abnormal uterine bleeding. Government of India
  4. Lucy Whitaker, Hilary O.D. Critchley. Abnormal uterine bleeding. Best Pract Res Clin Obstet Gynaecol. 2016 Jul; 34: 54–65. PMID: 26803558
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Abnormal uterine bleeding

అసాధారణ గర్భాశయ రక్తస్రావం వైద్యులు

Dr. Harshvardhan Deshpande Dr. Harshvardhan Deshpande General Physician
13 Years of Experience
Dr. Supriya Shirish Dr. Supriya Shirish General Physician
20 Years of Experience
Dr. Priyanka Rana Dr. Priyanka Rana General Physician
2 Years of Experience
Dr. Bajirao  Malode Dr. Bajirao Malode General Physician
13 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

అసాధారణ గర్భాశయ రక్తస్రావం కొరకు మందులు

Medicines listed below are available for అసాధారణ గర్భాశయ రక్తస్రావం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.