సారాంశం

జుట్టు రాలడం అనేది అంతర్లీన సమస్య యొక్క లక్షణం. ప్రతి రోజు 100 వెంట్రుకల కంటే ఎక్కువ వెంట్రుకలు రాలడాన్ని జుట్టు నష్టం లేదా జుట్టు రాలడం అని పిలుస్తారు మరియు దీనికి వైద్య సహాయం అవసరం. కారణాలు సులభంగా సరిదిద్దగల విటమిన్ లోపం నుండి క్యాన్సర్ కోసం కెమోథెరపీ వంటి తీవ్రమైన పరిస్థితుల వరకు ఉంటాయి. చాలా వరకు, జుట్టు రాలడానికి కారణమయ్యే విటమిన్ లోపం యొక్క సప్లిమెంటేషన్, ఒత్తిడి ఒత్తిడి విడుదల (స్ట్రెస్ రిలీజ్) లేదా తగ్గించుకోవడం  వంటి సాధారణ నివారణలను ఉపయోగించి జుట్టు రాలడాన్ని సులభంగా చికిత్స చేస్తారు.

  1. पोषक तत्वों की कमी से बाल गिरते हैं - Hair Loss due to Lack of Nutrients in Hindi
  2. అలోపేసియా అరేటా జుట్టు రాలడానికి కారణమవుతుంది - Alopecia areata causes hair loss in Telugu
  3. ल्यूपस रोग है बाल गिरने का कारण - Lupus Causes Hair Fall in Hindi
  4. बालों के झड़ने का कारण है भरी हुई धमनियां - Clogged Arteries can Cause Hair Loss in Hindi
  5. Hair loss due to zinc deficiency - in Telugu
  6. అంటువ్యాధులు జుట్టు రాలడానికి కారణమవుతాయి - Infections cause hair loss in Telugu
  7. ధూమపానం జుట్టు రాలడానికి కారణమవుతుంది - Smoking causes hair fall in Telugu
  8. హెల్మెట్ జుట్టు రాలడానికి కారణమవుతుంది - Helmet causes hair loss in Telugu
  9. लंबे बाल भी हैं बाल झड़ने का कारण - Hair Fall due to Long Hair in Hindi
  10. ऐनबालिक स्टेरॉयड बढ़ाते हैं बालों का झड़ना - Anabolic Steroids Cause Hair Loss in Hindi
  11. జుట్టు రాలడానికి కారణమయ్యే వ్యాధులు - Diseases that cause hair loss in Telugu
  12. జుట్టు రాలడానికి కారణమయ్యే మందులు - Medications that cause hair loss in Telugu
  13. జుట్టు రాలడం ఎందుకు జరుగుతుంది - Why does hair fall occur in Telugu
  14. Hair fall reasons - in Telugu
  15. హార్మోన్లు మరియు జన్యుపరమైన కారకాలు జుట్టు రాలడానికి కారణమవుతాయి - Hormones and genetic factors cause hair loss in Telugu
  16. తామర వ్యాధి జుట్టు రాలడానికి కారణమవుతుంది - Ringworm causes hair loss in Telugu
  17. ఆకలి లేకపోవడం జుట్టు రాలడానికి కారణమవుతాయి - Eating disorders cause hair loss in Telugu
  18. Hair loss in cancer - in Telugu
  19. రక్తహీనత జుట్టు రాలడానికి కారణమవుతుంది - Anemia causes hair loss in Telugu
  20. మితిమీరిన విటమిన్ ఎ శాతం జుట్టు రాలడానికి కారణమవుతుంది - Too much Vitamin A causes hair loss in Telugu
  21. ప్రోటీన్ లోపం వల్ల జుట్టు రాలడం జరుగుతుంది - Protein deficiency causes hair loss in Telugu
  22. పురుషులలో జుట్టు రాలడానికి కారణాలు - Causes of hair loss in men in Telugu
  23. మహిళల్లో జుట్టు రాలడానికి కారణాలు - Hair fall reasons in women in Telugu
  24. వంశపారంపర్యంగా జుట్టు రాలడం - Hereditary hair loss in Telugu
  25. గర్భధారణలో జుట్టు రాలడం - Hair loss in pregnancy in Telugu
  26. పిసిఒఎస్ వల్ల జుట్టు రాలడం - Hair loss due to PCOS in Telugu
  27. ఓవర్ స్టైలింగ్ వలన జుట్టు రాలడం - Hair loss from over styling in Telugu
  28. शारीरिक तनाव है बाल गिरने का कारण - Hair Loss due to Physical Stress in Hindi
  29. ఒత్తిడి జుట్టు రాలడానికి కారణమవుతుంది - Stress causes hair loss in Telugu
  30. థైరాయిడ్ రుగ్మతలు జుట్టు రాలడానికి కారణమవుతాయి - Thyroid disorders cause hair fall in Telugu
  31. विटामिन बी की कमी से बाल झड़ते हैं - Vitamin B Deficiency Cause Hair Loss in Hindi
  32. ऑटोइम्यून परिस्थितियां जिनसे बाल गिरते हैं - Autoimmune Conditions that Cause Hair Loss in Hindi
  33. ఆకస్మికంగా బరువు తగ్గడం వల్ల జుట్టు రాలడం - Hair fall due to sudden weight loss in Telugu
  34. క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టు నష్టం - Hair loss because of cancer treatment in Telugu
  35. अवसादरोधी दवाओं और ब्लड थिनर के कारण भी झड़ते हैं बाल - Hair Loss Caused by Antidepressants and Blood Thinners in Hindi
  36. ట్రైకోటిల్లోమానియా వల్ల జుట్టు రాలడం - Hair loss due to Trichotillomania in Telugu
జుట్టు రాలడం యొక్క కారణాలు వైద్యులు
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Anti-Hairfall Shampoo by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic shampoo has been recommended by our doctors to over 1 lakh people for hair fall, gray hair, baldness, itchy scalp, and dandruff with great results.
Anti-Hairfall Shampoo
₹494  ₹549  10% OFF
BUY NOW

ఈ రుగ్మతలో, హెయిర్ ఫోలికల్లో జుట్టు ఏర్పడదు. జుట్టు వెంట్రుక దాని మూలం నుండి అకస్మాత్తుగా పడిపోతుంది, నెత్తిమీద చిన్న, గుండ్రని మరియు మృదువైన మచ్చలు (ప్యాచ్ లు) ఏర్పడతాయి. అలోపేసియా అరేటా అన్ని వయసుల వారిని అంటే పిల్లలు మరియు పెద్దలను కూడా ప్రభావితం చేస్తుంది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

అధిక జ్వరం లేదా ఇన్ఫెక్షన్ తరువాత, మీరు నాలుగు వారాల నుండి మూడు నెలల వరకు జుట్టు రాలే సమస్యతో బాధపడవచ్చు. ఈ రకమైన జుట్టు నష్టం ఎక్కువగా దానంతట అదే నయమైపోతుంది. అప్పుడప్పుడు, దీనికి చికిత్స అవసరం కావచ్చు. అలాగే, నెత్తిమీద సంక్రమణ వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్, చుండ్రు, డెర్మటైటిస్, మరియు హెయిర్ ఫోలికల్స్ యొక్క వాపు (ఫోలిక్యులైటిస్) వంటివి జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి మరియు జుట్టు రాలడానికి కారణమవుతాయి.

అనేక ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు ధూమపానం బాగా తెలిసిన ఒక ప్రమాద కారకం. ఇది చర్మంపై వివిధ ప్రతికూల ప్రభావాలతో ముడి పడి ఉంటుంది. ప్రస్తుతం, అనేక పరిశోధన అధ్యయనాలు ధూమపానం జుట్టు పెరుగుదలపై ప్రత్యక్ష ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని సూచిస్తున్నాయి. సిగరెట్ పొగ చర్మ పై ఉండే జుట్టు వెంట్రుకల పాపిల్లా (జుట్టు ఫోలికల్ అంచున ఉండే గుర్తు) ను ప్రభావితం చేస్తుంది, మరియు పొగలోని జెనోటాక్సిన్లు హెయిర్ ఫోలికల్ యొక్క డిఎన్ఏ (DNA) ను దెబ్బతీస్తాయి. ధూమపానం వల్ల కలిగే బట్టతలని ఒక వ్యక్తి ఆరోగ్యం మీద ధూమపానం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల గురించి మరియు అలాగే ధూమపానం ఆపివేయడం వలన ఉండే సానుకూల ప్రభావాల గురించి తెలుసుకోవడం ద్వారా నివారించవచ్చు.

Biotin Tablets
₹699  ₹999  30% OFF
BUY NOW

మీరు ద్విచక్ర వాహనం మీద క్రమముగా (రోజు వారి) ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటే, మీ ప్రయాణ సమయమంతా హెల్మెట్ ధరించి ఉండాలి. సురక్షితమైన ప్రయాణానికి హెల్మెట్ ధరించడం తప్పనిసరి అయినప్పటికీ, హెల్మెట్ యొక్క దీర్ఘకాలిక ఉపయోగం మీ జుట్టుపై ఒత్తిడిని పెంచడం వలన లేదా అధిక చెమటను చెమటను కలిగించడం వలన జుట్టు దెబ్బతినడానికి కారణమవుతుంది. మీకు చుండ్రు మరియు అధిక చెమటలు పట్టడం వంటి సమస్యలు ఉంటే, ఇది జుట్టు రాలడానికి కూడా కారణం కావచ్చు. అయితే, మీరు హెల్మెట్ ధరించడం మానేయమని దీని అర్థం కాదు. ఈ సమస్యను నివారించడానికి ఒక చిన్న పరిష్కారం ఉంది. హెల్మెట్ ధరించే ముందు మీ తలపై రుమాలు లేదా తువ్వాలును కట్టుకోండి. రుమాలు చెమటను పేల్చేసుకుంటుంది, తద్వారా జుట్టు దెబ్బతినకుండా మరియు నష్టపోకుండా చేస్తుంది.

సుమారు 30 వ్యాధులు ఉన్నాయి, ఆ వ్యాధుల లక్షణాలలో జుట్టు రాలడం ఒక ప్రధాన లక్షణం. వ్యాధుల జాబితాలో హైపో- మరియు హైపర్ థైరాయిడిజం, రక్తహీనత మరియు క్యాన్సర్ ఉన్నాయి. అలాగే, ఒక పెద్ద శస్త్రచికిత్స, ఫ్లూ లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్యాల సమయలలో మరియు అవి నయం ఐన తరువాత గణనీయమైన స్థాయిలో జుట్టు రాలడం జరుగుతుంది.

ఔషధ ప్రేరిత జుట్టు నష్టం రెండు దశలను కలిగి ఉంటుంది, అవి ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • అనాజెన్ ఎఫ్లూవియం (Anagen effluvium)
    అంటే చురుకుగా పెరుగుతున్న జుట్టును కోల్పోవడం. క్యాన్సర్ మందులు, కొల్చిసిన్స్ (కొల్చికమ్ మొక్క యొక్క సారం) లేదా ఆర్సెనిక్, బిస్మత్ మరియు బోరిక్ యాసిడ్ వంటి రసాయనాల యొక్క పాయిజనింగ్ కారణంగా ఇది సంభవించవచ్చు.
  • టెలోజెన్ ఎఫ్లూవియం (Telogen effluvium)
    ఇది విశ్రాంతి దశలో (resting phase) ఉండే జుట్టు యొక్క నష్టం. హెపారిన్ మరియు వార్ఫరిన్ వంటి యాంటీకోయాగ్యులెంట్ మందుల వల్ల విశ్రాంతి దశలో జుట్టు రాలడం జరుగుతుంది; బీటా-బ్లాకర్స్ మరియు ఏసిఇ ఇన్హిబిటర్లు  వంటి యాంటీ హైపర్‌టెన్సివ్స్ (అధిక రక్తపోటును నియంత్రించేవి); నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు, హార్మోన్ పున రీప్లేస్మెంట్ చికిత్స మరియు ఆండ్రోజెన్ వంటి హార్మోన్లు; వాల్ప్రోయిక్ యాసిడ్, కార్బమాజెపైన్ మరియు ఫెనిటోయిన్ వంటి యాంటీకన్వెల్సెంట్లు (ఫిట్స్  మరియు మూర్ఛవ్యాధికి చికిత్స చేసేవి); యాంటిడిప్రెసెంట్స్ మరియు మూడ్ స్టెబిలైజర్లు; మరియు యాంటిథైరాయిడ్ మందులు, కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, యాంటిసైకోటిక్ మందులు, యాంటీయాంక్సియేటి (antianxiety) మందులు మరియు నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫలమేటరి మందులు (NSAID లు) వంటివి  ఇతర మందులు.

సగటు జుట్టు పెరుగుదల చక్రం (హెయిర్ గ్రోత్ సైకిల్) రెండు నుండి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది, ప్రతి నెలలో జుట్టు ఒక సెంటీమీటర్ పెరుగుతుంది. ఈ చక్రం మూడు దశలను కలిగి ఉంటుంది, అవి: అనాజెన్ (anagen), టెలోజెన్ (telogen) మరియు ఎక్సోజెన్ (exogen). ఒక దశలో, మీ నెత్తిపై 90% జుట్టు పెరుగుతోంది (అనాజెన్ దశ), మిగిలిన 10% విశ్రాంతి దశలో (టెలోజెన్ దశ) ఉన్నాయి. ప్రతి మూడు, నాలుగు నెలల్లో, విశ్రాంతిలో ఉండే వెంట్రుకలు రాలిపోతాయి (ఎక్సోజెన్ దశ) మరియు అవి కొత్త జుట్టుతో భర్తీ చేయబడతాయి. జుట్టు ఇలా రాలిపోవడం మరియు పెరుగడం సాధారణ జుట్టు పెరుగుదల చక్రంలో ఒక భాగం. నెత్తిమీద కొన్ని ప్రాంతాల్లో జుట్టు రాలడం అధికంగా జరిగినప్పుడు, మరియు కొత్త జుట్టు రాలిపోయిన జుట్టు వెంట్రుకలను భర్తీ చేయనప్పుడు, ఏర్పడే పరిస్థితిని జుట్టు రాలడం అని అంటారు. జుట్టు రాలడం అనేది స్త్రీపురుషుల ఇద్దరినీ ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. సాధారణంగా, నెత్తిమీద సుమారు 100,000 తంతువుల/వెంట్రుకల జుట్టు ఉంటుంది. ప్రతిరోజూ 50 నుండి 100 తంతువుల జుట్టును రాలిపోవడం సాధారణం. కానీ, నెత్తిమీద బట్టతల యొక్క పాచెస్ (గుర్తులు/మచ్చలు) కనిపించినప్పుడు అది శాశ్వతంగా జుట్టు రాలడాన్ని సూచిస్తుంది. వైద్య పరంగా, జుట్టు యొక్క పూర్తి లేదా పాక్షిక నష్టాన్ని అలోపేసియా అంటారు.

జుట్టు రాలడం యొక్క కుటుంబ చరిత్ర మరియు ఇతర జన్యుపరమైన కారకాల పురుషులలో రాలడానికి కారణమవుతాయి. ఈ కారణాల వలన శరీరంలో విడుదలయ్యే ఆండ్రోజెన్‌లకు (పురుష లక్షణాలను మరియు లైంగికతను అభివృద్ధి చేయడంలో మరియు నియంత్రించడంలో ముఖ్యమైన పాత్రను పోషించే హార్మోన్లు) హెయిర్ ఫోలికల్స్ యొక్క ప్రతిస్పందనలో మార్పు కలుగుతుంది. దీనిని మేల్ ఆండ్రోజెనెటిక్ అలోపేసియా లేదా మగవాళ్ల తరహా బట్టతల (మేల్ పాట్రాన్ బాల్డ్ నెస్) అని అంటారు. పురుషులలో జుట్టు రాలడానికి ఇది చాలా సాధారణ కారణం మరియు 30-50% మంది పురుషులు దీని వలన ప్రభావితమవుతారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

తామర (రింగ్వార్మ్) అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇది అధికంగా జుట్టు రాలడానికి దారితీస్తుంది. ఇది సాధారణంగా పిల్లలలో కనిపించే ఒక అంటు వ్యాధి. దీనికి సమయానికి చికిత్స చేయకపోతే, బట్టతలకి దారితీయవచ్చు.

అనోరెక్సియా అనేది ఒక తిండి రుగ్మత, దీనిలో ఒక వ్యక్తిలో బరువు పెరుగుతుందనే భయంతో పాటు ఆకలి వేయకపోవడం కూడా ఏర్పడుతుంది. ఈ కారణంగా, వ్యక్తికి ఆకలి అనిపించదు లేదా తినడు  మరియు అందువల్ల అసంపూర్ణ పోషణను పొందుతాడు. జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాల లోపం జుట్టు రాలడానికి దారితీస్తుంది. బులిమియా మరొక రకమైన తిండి రుగ్మత, దీనిలో వ్యక్తి తినిన తరువాత అధికంగా తినేసాడనే భావనతో స్వయంగా వాంతి చేసుకుంటాడు, ఫలితంగా అవసరమైన పోషకాల యొక్క లోపం ఏర్పడి జుట్టు రాలడానికి దారితీస్తుంది.

రక్తహీనత అంటే ఎర్ర రక్త కణాల సంఖ్య సాధారణం కంటే తక్కువగా ఉండడం లేదా వాటి యొక్క  ఆక్సిజన్ను మోసే సామర్థ్యం తగ్గిపోవడం. అందువల్ల, ఈ కణాలు శరీరం యొక్క ఆక్సిజన్ అవసరాలను తీర్చలేకపోతాయి. రక్తహీనతకు అత్యంత సాధారణ కారణం ఐరన్ లోపం. రక్తహీనత యొక్క ఇతర కారణాలు ఫోలిక్ ఆమ్లం మరియు విటమిన్ బి 12 లోపం, దీర్ఘకాలిక ఇన్ఫలమేషన్, కొన్ని రకాల అంటువ్యాధులు. రక్తహీనతలో ఈ ముఖ్యమైన పోషకాల లోపం జుట్టు రాలడానికి దారితీస్తుంది.

విటమిన్ ఎను ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) గా లేదా ఇంజ్టబుల్ సప్లిమెంట్ల ద్వారా అధికంగా  తీసుకోవడం వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. మీరు అధికంగా విటమిన్ ఎను తీసుకోవడం మానేసిన వెంటనే, జుట్టు రాలడం తగ్గిపోతుంది మరియు జుట్టు తిరిగి పెరగడం ప్రారంభమవుతుంది.

క్వాషియోర్కోర్ మరియు మరాస్మస్ వంటి సమస్యలలో మాదిరిగా శరీరం యొక్క ప్రోటీన్ అవసరాన్ని తగినంతగా తీర్చలేనప్పుడు ఏర్పడే ప్రోటీన్ యొక్క తీవ్రమైన లోపం జుట్టు పలుచబడానికి మరియు జుట్టు రాలడానికి దారితీస్తుంది. అటువంటి పరిస్థితులలో, శరీరం అధిక ముఖ్యమైన పనుల కోసం అందుబాటులో ఉన్న ప్రోటీన్‌ను ఆదా చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటువంటి సందర్భాలలో జుట్టు పెరుగుదలను నిలిపివేయడం అనేది శరీరం ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేసే ఒక మార్గం. రెండు మూడు నెలల పాటు ప్రోటీన్ తగినంతగా తీసుకోనప్పుడు మాత్రమే జుట్టు రాలడాన్ని గమనించవచ్చు. ప్రోటీన్ తీసుకోవడాన్ని పెంచడం ద్వారా జుట్టు రాలడానికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. చేపలు, గుడ్లు మరియు మాంసం తినడం ద్వారా ఆహారంలో ప్రోటీన్ పరిమాణాన్ని పెంచుకోవచ్చు. మీరు శాకాహారులైతే, ప్రోటీన్ పరిమాణాన్ని పెంచడానికి మరియు జుట్టు నష్టానికి చికిత్స చేయడానికి మీ ఆహారంలో బీన్స్ మరియు నట్స్ (గింజలను) చేర్చవచ్చు.

వారసత్వం

జుట్టు రాలడం స్త్రీపురుషులలో సాధారణం. వయస్సు పెరుగుతున్న కొద్దీ, జుట్టు పలుచబడం మరియు జుట్టు రాలడం పెరుగుతుంది. జుట్టు పలుచబడం మరియు జుట్టు రాలడం అనేది వ్యక్తికి వ్యక్తికి మారుతుంది, ఇది జుట్టు నష్టం కుటుంబ తరహా (పాట్రాన్) కు సంబంధించినది మరియు ఏ వైద్య సమస్యకు సంబంధించినది కాదు. వంశపారంపర్యంగా కాకుండా, ఈ రకమైన జుట్టు నష్టం వృద్ధాప్యం మరియు శరీరంలో హార్మోన్ల మార్పులతో (మెనోపాజ్ మాదిరిగా) కూడా ముడిపడి ఉంటుంది. ఇది బట్టతలకి దారితీస్తుంది, ఇది మహిళల కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. యుక్తవయస్సు తర్వాత ఏ వయసులోనైనా మగవారి తరహా బట్టతల (Male pattern baldness) గమనించవచ్చు; 70 సంవత్సరాల వయస్సుకు వచ్చేసరికి 80% మంది పురుషులు జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటారు.

  • గర్భధారణ సంబంధిత జుట్టు నష్టం సాధారణంగా ప్రసవం ఐన తరువాత జరుగుతుంది. గర్భధారణ సమయంలో, శరీరంలో జరిగే మార్పుల వలన విశ్రాంతి దశలో (resting phase) ఉండే జుట్టు వెంట్రుకల సంఖ్య యొక్క పెరుగుదలకు దారితీస్తుంది. అందువల్ల, ప్రసవం తరువాత, మహిళలు అధికంగా జుట్టు నష్టాన్నిఅనుభవించవచ్చు. ప్రసవించిన మూడు, నాలుగు నెలల్లో ఈ పరిస్థితి దానంతట అదే నయమవుతుంది  కాబట్టి ప్రసవం తర్వాత ఉండే తీవ్రమైన జుట్టు నష్టం పెద్ద సమస్య కాదు. అలాగే, గర్భధారణ తర్వాత జుట్టు నష్టం వల్ల బట్టతల పాచెస్ ఏర్పడవు; అందువల్ల, గర్భధారణ తర్వాత ఉండే జుట్టు నష్టం గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
  • గర్భధారణ సమయంలో కూడా జుట్టు నష్టాన్ని అనుభవిస్తే, మీరు విటమిన్ లేదా మినరల్ లోపంతో బాధపడుతున్నారు అని అర్ధం, దానిని సంబంధిత సప్లిమెంట్ల వినియోగం ద్వారా సులభంగా సరిదిద్దవచ్చు.
  • గర్భస్రావం, మృతపిండం జన్మించడం మరియు గర్భస్రావం కారణంగా కూడా జుట్టు అధికంగా రాలవచ్చు.

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్) అంటే అండాశయాలలో ద్రవం నిండిన తిత్తులు (fluid-filled cysts) అభివృద్ధి చెందుతాయి, ఇది మహిళల్లో వారి శరీర పనితీరును ప్రభావితం చేస్తుంది. జుట్టు రాలడం వల్ల జుట్టు పలుచబడడం  పిసిఒఎస్ యొక్క సాధారణ లక్షణాలలో ఒకటి.

హెయిర్‌స్టైలింగ్ మరియు వివిధ జుట్టు సంరక్షణ ఉత్పత్తులు మీ జుట్టుపై హానికరమైన ప్రభావాన్ని కలిగిస్తాయి, తద్వారా జుట్టు రాలడాన్ని ప్రేరేపిస్తాయి.

  • తరచుగా బ్లీచింగ్ చెయ్యడం మరియు జుట్టుకు కృత్రిమ రంగులు వేసుకోవడం మరియు హెయిర్ స్ప్రేలు, జెల్ మరియు ఇతర ఉత్పత్తులను అధికంగా ఉపయోగించడం అనేది జుట్టు రాలడానికి కారణమవుతుంది. చర్మవ్యాధి నిపుణులు ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఇటువంటి ఉత్పత్తులను తక్కువ ఉపయోగించాలని సిఫార్సు చేస్తారు.
  • బ్లో డ్రైయర్స్ (Blow dryers), హెయిర్ స్ట్రెయిట్నెర్స్ (hair straighteners) మరియు కర్లింగ్ ఐరన్స్ (curling irons) మీ జుట్టును అధిక ఉష్ణోగ్రతకు బహిర్గతం చేస్తాయి. బ్లో డ్రైయర్‌లు హెయిర్ షాఫ్ట్‌లలోని తేమను కూడా ఎండిపోయెలా చేస్తాయి తద్వారా జుట్టు పొడిబారి మరియు పెళుసుగా మారుతుంది. స్ట్రెయిటెనర్స్ మరియు కర్లింగ్ మెషిన్ను  బ్లో డ్రైయర్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను ఉపయోగిస్తాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ జుట్టును గాలికి ఆరబెట్టాలని మరియు పొడి జుట్టుకు మాత్రమే స్టైల్ చేయాలని సిఫారసు చేస్తుంది. హెయిర్ స్ట్రెయిట్నర్స్ మరియు కర్లర్ల వాడకాన్ని కూడా పరిమితం చేయాలని ఇది సిఫార్సు చేస్తుంది.
  • తల క్లిప్లు  మరియు రబ్బరు బ్యాండ్లు కూడా జుట్టును చాలా గట్టిగా నొక్కిపెడతాయి తద్వారా  జుట్టు చిట్లడానికి మరియు రాలడానికి దారితీస్తాయి.
  • పోనీటెయిల్స్, బ్రెయిడ్లు మరియు బన్స్ వంటి హెయిర్ స్టైల్ లను జుట్టును గట్టిగా లాగిపెట్టి వేసుకుంటే, అది ట్రాక్షన్ అలోపేసియా (traction alopecia) అని పిలువబడే ఒక విధమైన  జుట్టు నష్టానికి కారణం కావచ్చు, దీనిలో వెంట్రుకలు నుదిటి ప్రాంతంలో అధికంగా రాలిపోతాయి.
  • అధికంగా తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు రాలవచ్చు. ఒక రోజులో 100 కంటే ఎక్కువ సార్లు దువ్వెనతో  జుట్టు దువ్వడం అనేది కూడా జుట్టు రాలడానికి దారితీస్తుంది.

ప్రియమైన వ్యక్తి యొక్క మరణం, విడాకులు వంటి శారీరక లేదా మానసిక ఒత్తిడిలు, ఫ్లూ , అధిక జ్వరం, శస్త్రచికిత్స తర్వాత, మరియు తీవ్రమైన ఇన్ఫెక్షన్ల వంటి వాటి ద్వారా కూడా జుట్టు రాలడం (మొత్తం జుట్టులో సగం నుండి మూడు వంతులు) ప్రేరేపించబడుతుంది. అటువంటి పరిస్థితులలో, ఒత్తిడి ఎపిసోడ్ తర్వాత కొన్ని వారాల నుండి నెలల వరకు జుట్టు రాలుతుంది మరియు ఆరు నుండి ఎనిమిది నెలల తర్వాత అది నయం కావడం ప్రారంభిస్తుంది. సాధారణంగా, ఈ రకమైన జుట్టు నష్టం తాత్కాలికమే, కానీ కొన్ని దీర్ఘకాలిక సమస్యగా కూడా మారవచ్చు.

థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపం వల్ల థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది (హైపోథైరాయిడిజం) అది జుట్టు రాలడానికి కారణమవుతుంది. థైరాయిడ్ వ్యాధుల వల్ల కలిగే జుట్టు నష్టం వైద్యులు సూచించిన మందులు తీసుకోవడం ద్వారా నయం అవుతుంది. అలాగే, థైరాయిడ్ హార్మోన్ల అధిక ఉత్పత్తి (హైపర్ థైరాయిడిజం) కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. రెండు పరిస్థితులలో, జుట్టు రాలడం అనేది ఒక నిర్దిష్ట ప్రదేశాలలో కాకుండా తల అంతా ఉంటుంది.

మీరు మూడు నుండి ఆరు నెలల కాలంలో ఆకస్మికంగా ఆరు నుండి ఎనిమిది కిలోగ్రాముల బరువును కోల్పోతే, జుట్టు రాలడాన్ని గమనించవచ్చు. జుట్టు రాలడానికి ఇది ఒక సాధారణ కారణం మరియు వ్యక్తి ఆరోగ్యకరమైన బరువును నిర్వహిస్తూ పోషకమైన మరియు సమతుల్య ఆహారం తిన్నప్పుడు జుట్టు దానంతటదే తిరిగి పెరుగుతుంది కాబట్టి ఈ రకమైన జుట్టు నష్టానికి నిర్దిష్ట చికిత్స ఏది అవసరం లేదు.

కీమోథెరపీ మరియు రేడియోథెరపీ వంటి కొన్ని క్యాన్సర్ చికిత్సలు కూడా జుట్టు రాలిపోవడానికి  కారణమవుతాయి. ఈ చికిత్సలు హెయిర్ ఫోలికల్స్ యొక్క నష్టం, ఆరోగ్య స్థితిలో లోపం, బలహీనమైన జీవక్రియ మరియు ఒత్తిడికి దారితీస్తాయి. ఏదేమైనా, ఈ రకమైన జుట్టు నష్టం శాశ్వతం కాదు, చికిత్స పూర్తయిన తర్వాత జుట్టు సాధారణంగా పెరుగుతుంది మరియు వ్యక్తి కోలుకోవడం ప్రారంభిస్తాడు.

ట్రైకోటిల్లోమానియా అనేది ఒక రుగ్మత, దీనిలో ఒక వ్యక్తి తన జుట్టును తానే పీకుకుంటాడు. వెంట్రుకలు, కనుబొమ్మలు మరియు నాసికా రంధ్రాలలో ఉండే  వెంట్రుకలు వంటి ఇతర శరీర భాగాల నుండి వెంట్రుకలు బయటకు తీయాలనే కోరిక కూడా వ్యక్తికి ఉండవచ్చు.

నగర వైద్యులు Trichologist వెతకండి

  1. Trichologist in Jaipur
Dr. Rohan Das

Dr. Rohan Das

Trichology
3 Years of Experience

Dr. Nadim

Dr. Nadim

Trichology
7 Years of Experience

Dr. Sanjeev Yadav

Dr. Sanjeev Yadav

Trichology
7 Years of Experience

Dr. Swadesh Soni

Dr. Swadesh Soni

Trichology
10 Years of Experience

వనరులు

  1. American Academy of Family Physicians. Hair Loss. [Internet]
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Hair loss
  3. American Academy of Dermatology. Rosemont (IL), US; Hair loss
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Hair Loss
  5. American Pregnancy Association. [Internet]; Pregnancy And Hair Loss.
  6. American Academy of Dermatology. Rosemont (IL), US; HAIR LOSS: WHO GETS AND CAUSES
  7. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Anaemia.
  8. Trüeb RM. Association between smoking and hair loss: Another opportunity for health education against smoking?. Dermatology. 2003; 206(3):189-91. PMID: 12673073
  9. Sharma L, Dubey A, Gupta PR, & Agrawal A. Androgenetic alopecia and risk of coronary artery disease. Indian Dermatol Online J. 2013. Oct-Dec; 4(4): 283–287.
  10. Guo EL & Katta R. [link] Dermatol Pract Concept. 2017. Jan; 7(1): 1–10. PMID: 28243487
  11. Cranwell W, Sinclair R. Male Androgenetic Alopecia. [Updated 2016 Feb 29]. In: Feingold KR, Anawalt B, Boyce A, et al., editors. Endotext [Internet]. South Dartmouth (MA): MDText.com, Inc.; 2000-.
Read on app